Monday, May 14, 2007

శోధకుడు

రొట్టెగా ఈ రాళ్ళను మలచి
భుజించి ఆకలి జయించలేవా?
దేవుని వర పుత్రుడవైతే?!


రొట్టె మాత్రం చాలదోయి
దేవుని మాటలే బ్రతికించునోయి
నరుని!

****

శిఖరమెక్కి దూకలేవా?
రాయి తగలక దేవదూతలు
తమ చేతులతో నిన్నెత్తుకోరా?!


దేవదేవుని శోధించరాదు
వ్రాయబడెను గ్రంథమందు!

****

మ్రొక్కరాదా నాకొక్కసారి?
లోకమంతా నీ స్వంతం చేస్తా!


చాలుచాలిక వెళ్ళవోయి,
దేవుడే పూజార్హుడోయి!

0 comments: