Tuesday, May 8, 2007

భూకంపం!

ఒక్క క్షణం...

పుడమితల్లికి పురుటినొప్పులు

కల్లోలం వినాశనం,

బ్రతుకు తెగిన గాలిపటం!


గర్వభంగం...

సాంకేతిక విఙ్ఞానం

నిస్సహాయం...నిరుపయోగం!

...

మహోన్నత సౌథాలు,

రమ్యాకాశహర్మ్యాలు!

...

శిథిలాలు,

రాళ్ళు, మట్టి,

ఛిద్రమైన జీవితాలు!

4 comments:

కొత్త పాళీ said...

విభాగారూ, మీ కవితల్లో భావాలూ పదచిత్రాలూ చాలా బావున్నై. వ్యక్తీకరణే మరీ శ్రీశ్రీ అనుసరణలాగా ఉంది. మీ సొంత గొంతుకని అభివృద్ధి చేసుకోండి.

wiba said...

చాలా థ్యాంక్స్ అండి.నా కలం పేరు "విబా".వొత్తు లేదండీ!:-).శ్రీశ్రీ "మహాప్రస్థానం" చాలా సార్లు చదివాను.సొంత "గొంతుక" కోసం ప్రయత్నిస్తున్నా!

radhika said...

చాలా బాగుందండి.

bolloju ahmad ali baba said...

పుడమితల్లికి పురుటినొప్పులు అనే ప్రయోగం భూకంపానికి సరిపోతుందా. పురిటినొప్పులు కొత్త సృష్టికి, కొత్త ఆశకు, కొత్త జీవనానికి సంకేతం. భూకంపం అనేది విధ్వంసానికి, వినాసనానికి, ప్రకృతికి వచ్చిన కోపానికి సంకేతంగాను, అనుకోవచ్చు. భుకంపం తరువాత జరిగేది కొత్త సృష్టి జరగాలి అని మీభావనా? అట్లయితే కల్పాంతం అనే భావం లో కవిత రావాలి.
ఆలోచించండి. నె చెప్పింది నచ్చకపోతె విభేదించి తర్కించండి.
బొల్లోజు బాబా